మద్యం దుకాణాల కోసం 100 కోట్లు ఖర్చు చేసిన ఏపీ రియల్ ఎస్టేట్ కంపెనీ

-

మద్యం దుకాణాల కోసం 100 కోట్లు ఖర్చు చేసింది ఏపీ రియల్ ఎస్టేట్ కంపెనీ. తెలంగాణ ఎక్సైజ్ కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో ఈసారి పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ స్థిరాస్తి సంస్థ ఏకంగా 5వేల దరఖాస్తులు చేసినట్టు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో వెళ్లడైంది.

ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ. 100 కోట్లు వెచ్చించింది. వైజాగ్ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న ఆ సంస్థ తొలిసారిగా ఇక్కడ మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మద్యం వ్యాపారం తీరును లోతుగా పరిశీలించిన మీదట హైదరాబాద్ శివారు ప్రాంతాలపై ఆ సంస్థ దృష్టి సారించింది. ముఖ్యంగా శంషాబాద్, సరూర్నగర్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలకు బాగా గిరాకీ ఉండటంతో ఆ ప్రాంతాల్లోని పలు దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో ఆ సంస్థకు లక్కీ డ్రాలో 110కి పైగా దుకాణాలు దక్కినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version