Breaking News : TSPSC చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా TSPSC చైర్మన్ ను ప్రకటించింది. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో TSPSC కి సంబంధించిన కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే నిన్న రాత్రి TSPSC సభ్యుల నియామకం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్టు సమాచారం.

అయితే సరైన పేర్లు ప్రతిపాదిస్తే.. వెంటనే తాను ఆమోదిస్తానని గవర్నర్ తమిళి సై వారికి భరోసా ఇచ్చింది. తాజాగా మహేందర్ రెడ్డి పేరు గవర్నర్ ఆమోదించింది. TSPSC సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర,   పాల్వాయి రజినికుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రాం మోహన్ రావు నియమితులయ్యారు. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు  గ్రూప్స్  పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం కలిగింది. ఈ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు నిరుద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news