కేటీఆర్, కవితపై ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

-

కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పై ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని.. కవితకు హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషమని చురకలు అంటించారు. బైంసాలో హిందువుల మీద దాడులను ఆపాలని కవితకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సస్పెండ్ ఎవర్ని చేయాలో…‌ ఎవరకి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసు కవితను ఎద్దేవా చేశారు.

సీఎం కొడుకుతో చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని.. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు? అని ఆగ్రహించారు. కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడని.. గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ భాషను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏమి చేశారో సీఎం, కేటీఆర్, సోమేష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నాలుగు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటకీ.. టెక్ట్స్ బుక్స్ కోసం టెండర్లకు పిలవకపోవటం దారుణమని.. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అటకెక్కాయని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version