అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. మోడీకి తెలంగాణ అంటే ఇష్టంలేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

-

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాను.. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. అమర వీరులను కించ పరిచారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేసారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసింది అన్నారు.

తెలంగాణ అంటే ప్రధాని మోడీకి మొదటి నుంచి చిన్న చూపు అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును మోడీ ఎన్నో సార్లు అవమానించారన్నారు. తెలంగాణ ను మోడీ అవమానిస్తే.. ఇప్పటివరకు బీజేపీ నేతలు మాట్లాడలేదన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు, హైదరాబాద్ కి ఏం తెచ్చారని ప్రశ్నించారు. 100 సీట్లలో డిపాజిట్ రాని బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బడ్జెట్ పై జరిగిన అన్యాయం గురించి తెలంగాణ బీజేపీ నేతలు స్పందించరా..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version