నా తండ్రి వారసత్వం ప్రకారం నేను ఎస్సీనే – ఎమ్మెల్సీ కడియం

-

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. దేశ విదేశాలలో తనకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని రాజయ్య చేసిన ఆరోపణలను నిరూపించాలని కడియం సవాల్ విసిరారు. ఆస్తుల వివరాలు తీసుకువస్తే వాటన్నింటినీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని దళిత బిడ్డలకు రాసిస్తానని స్పష్టం చేశారు. ఈ సవాల్ ని స్వీకరించేందుకు రాజయ్య సిద్ధమా..? అని ప్రశ్నించారు.

ఒకవేళ తన సవాల్ ని రాజయ్య స్వీకరించకపోతే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తాను ఎస్సీ కాదని రాజయ్య చేసిన విమర్శలపై కూడా స్పందించారు. ఆయన స్థాయి మరిచి నాపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. నా తల్లి బిసి, తండ్రి ఎస్సీ అని అన్నారు. తండ్రి వారసత్వం ప్రకారం తాను ఎస్సీ నేనని అన్నారు కడియం. ప్రతి ఒక్కరి తల్లిని అవమానపరిచేలా రాజయ్య శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్య వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version