సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు…బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇకనుంచి వారికి కూడా నెలకు 2016 పెన్షన్ వస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా కార్మికులు చేసిన బీడీలను లెక్కించి, ప్యాకింగ్ చేసి, కంపెనీలకు అప్పగించడమే టేకేదారుల బాధ్యత. అలాంటి వారికి పెన్షన్ ఇవ్వడం సరైన నిర్ణయమని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ వివరించారు.