సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మాణానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పలికింది. దేశ వ్యాప్తంగా ఈ కులగణన సర్వే చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మాణం చేశారు. ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేపడతామని.. వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని వెల్లడించారు.
తొలుత సీఎం రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సమయంలో వాదోపవాదనలు నడిచాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, బీజేపీ నుంచి పాయల్ శంకర్.. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి సాంబశివరావు మాట్లాడారు. వారి వారి వాదనలు వినిపించారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమాధానం చెప్పారు. చివరికీ అసెంబ్లీలో ఆమోదం తెలిపారు.