గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలిక ను వేధించాడు మైనర్ బాలుడు. ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని మరో మైనర్ వీడియో రికార్డ్ చేశాడు. వీడియో చూపించి బాలికను లైంగికంగా వేధించాడు రెండో మైనర్. ఈ తరుణంలోనే… ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది.. మైనర్ మొబైల్ ఫోన్ పగలగొట్టింది బాలిక.

ఇద్దరూ గొడవ పడుతుండగా చూశాడు మూడో మైనర్. ఈ విషయం అందరికీ చెప్తానని బాలిక కు మూడో మైనర్ కూడా వేధింపులకు గురి చేశాడు. ఇలా కొన్ని రోజులుగా బాలికను వేధించి.. రేప్ చేస్తున్నారట ముగ్గురు మైనర్లు. ఈ విషయం తెలుసుకున్న బాలిక స్నేహితులు.. ఆ బాలిక పేరెంట్స్ కి సమాచారం అందించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్. దీంతో ముగ్గురు మైనర్ల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.