మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు తీసుకువచ్చినా… మహిళలపై అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

ఇక తాజాగా కూల్ డ్రింక్ తాగించి యువతిపై లైంగిక దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మాపురిలో కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి 19 ఏళ్ల యువతిపై… ఆన్లైన్ విలేకరి గంగాధర్ లైంగిక దాడి చేశాడు.
అనంతరం మొబైల్ ఫోన్లో వీడియోలు తీసి తన స్నేహితుడికి షేర్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకేముంది బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు.. అనంతరం గంగాధర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.