ప్రయాణికులు లేక.. గిరాకీ రాక.. రైలు కింద పడి యువ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దింతో తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 35కి పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు.
ఇక తాజగా ప్రయాణికులు లేక.. గిరాకీ రాక.. రైలు కింద పడి యువ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా బొక్కలోనిపల్లికి చెందిన దేవేందర్ (23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా మూడు నెలలుగా ఆటోకు గిరాకీ రావడం లేదు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దేవేందర్‌కు కుటుంబ పోషణ భారమైంది. చేసేది లేక బుధవారం సాయంత్రం బండమీదిపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పై వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.