ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్‌ – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ‘నేను నా బిడ్డ, భార్య ప్రచారం చేస్తే గెలిచానని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అవును.. నేను గెలవాలని నా భార్యాబిడ్డలు కచ్చితంగా ప్రచారం చేశారు. కానీ నా చరిత్ర పొన్నం ప్రభాకర్ వంటిది కాదు. 2018లో కరీంనగర్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేసినప్పుడు.. ఆయన ఓడిపోవాలని ఆయన భార్య ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది నిజమా? కాదా?’ అని ఆయన ప్రశ్నించారు.

ఇటీవలే పొన్నం ప్రభాకర్ ఓ ఆర్డీవో సాయంతో ఎమ్మార్వోకి ఫోన్ చేసి కళ్యాణ లక్ష్మీ చెక్కులను కౌశిక్ రెడ్డితో పంపిణీ చేయకూడదని.. అధికారులు లేదా లోకల్ సర్పంచ్, ఎంపీటీసీలతో పంపిణీ చేయించాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై పొన్నం ప్రభాకర్ కి ఛాలెంజ్ విసిరారు కౌశిక్ రెడ్డి. పొన్నం.. నీ ఆఫీసు నుండే లీకులు బయటికి వస్తున్నాయి. ఆర్డీఓ గారికి నాకు మధ్య ఒక్క ఫోన్ కాల్ సంభాషణ ఉన్న దేనికైనా రెడీ.. పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ అయ్యిందే నీ ఆఫీస్ నుంచి అని తెలిపారు. ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version