Backlash to Chennamaneni Ramesh in the High Court: బీఆర్‌ఎస్ పార్టీ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదంటూ తీర్పు వెలువడింది. చెన్నమనేని రమష్ భారతీయ పౌరుడు కాదన్న హైకోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. చెన్నమనేని రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.
జర్మన్ పౌరుడిగా ఉంటూ భారత్ లో ప్రజాప్రతినిధి గా ఎన్నికయ్యాడు అని తెలిపింది హైకోర్టు. నష్ట పరిహారం కింద ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపులు అన్ని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. లీగల్ సర్వీస్ అథారిటీకి ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది మై కోర్టు.