బ్యాచ్ లర్స్ కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

-

పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూసే బ్యాచ్ లర్స్ కు ఈ వార్త బ్యాడ్ స్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే లేట్ అయ్యింది.. త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహం చేసుకోవాలంటే ఇక 3 నెలల వరకు నో ఛాన్స్ అని పండితులు  చెబుతున్నారు. మళ్లీ ఆగస్టు తర్వాతే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ పడింది. బ్యాచ్ లర్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పే రోజులు పోవాలంటే ఆగస్టు 8 తర్వతే అంటున్నారు పురోహితులు ఎందుకంటే.. ఇప్పుడు నేటితో మూఢం ప్రవేసించింది. మూఢం అంటే గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు.

గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా.. శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. అయితే.. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. కాగా.. ఈ సారి శుభకార్యాలు అశ్వయుజ మాసంలో మొదలయ్యాయి. ఒక్క పుష్యమాసంలో తప్ప మిగతా కార్తీకం, మాఘం, చైత్రమాసాలలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు భేషుగ్గా జరిగాయి . ఇక కొన్ని సందర్భాల్లో అయితే.. అత్యవసరం అనుకునేవారు వారికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముహూర్తాలకు వెసులుబాటు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 08 వరకు మూఢం ఉంది. పెళ్లిళ్ల పై ఆధారపడే వారందరూ విశ్రాంతి తీసుకోవాల్సిందే మరీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version