పార్టీ మారటంపై వస్తున్న అసత్య ప్రచారాలను బాజిరెడ్డి గోవర్ధన్ కొట్టి వేసారు. తను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు, కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు ప్రచారం చేసినవి పూర్తిగా అబద్దం అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. తను ఏ పార్టీలోకి వెళ్లనని.. చివరి వరకు కేసీఆర్ గారితోనే ఉంటా వారితోనే నా ప్రయాణం అని స్పష్టం చేసారు మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్.
కాగా, గులాబీ దళానికి కంచుకోట అయిన కరీంనగర్లో ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కరీంనగర్‌లో ఇవాళ రెండో సభ నిర్వహించబోతున్నారు. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని.. అందుకే అదే సెంటిమెంట్‌గా ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.