Bakka Judson: కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బక్క జడ్సన్ ఇంట్లో కరెంట్ తీసేశారు. దీనిపై ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బక్క జడ్సన్. ఆదివారం రోజున సాయంత్రం భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో.. చాలా చోట్ల పవర్ తీసేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బక్క జడ్సన్ ఇంట్లో కరెంట్ తీసేశారు. దీంతో కరెంటు ఆఫీసుకు కాల్ చేశారు జడ్సన్. కరెంటు పోయి మూడు గంటలు గడుస్తున్నా విద్యుత్ సిబ్బంది నుండి స్పందన లేదని తెలిపారు సామాజిక కార్యకర్త బక్క జడ్సన్.
కరెంటు పోయిందని గంట కింద 1912 కు ఫోన్ చేసిన. ట్విట్టర్ల పోస్ట్ చేసిన. తెలంగాణ విదుత్ శాఖ గారు USC నంబర్ అడిగిండు అయినా ఇంతవరకు దాదాపు 3 గంటలు కావస్తోంది కరెంటు పోయి ఫిర్యాదులు చేసినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కెళ్ళి స్పందన లేదని ఫైర్ అయ్యారు బక్క జడ్సన్. కరెంటు పోయిందని గంట కింద 1912 కు ఫోన్ చేసినా…. ట్విట్టర్ల పోస్ట్ చేసినా స్పందన లేదని…నా లాంటి వాళ్లకే ఇలాంటి సమస్యలు ఎదురైతే…సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసారు. 24 గంటల కరెంట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు.