సీఎం సహాయనిధికి బాలకృష్ణ రూ.50లక్షలు విరాళం.. రేవంత్ రెడ్డికి అందజేసిన బాలయ్య కూతురు

-

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు వరదలు ఏరులై పారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలాగే నందమూరి బాలకృష్ణ కూడా అటు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.50లక్షలు, ఇటు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50లక్షలు అందించనున్నట్టు ప్రకటించారు.

బాలకృష్ణ ప్రకటించినట్టు గానే ఇవాళ చెక్ అందజేశారు. తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ తరపున చెక్‌ను అందజేసింది బాలకృష్ణ కూతురు తేజస్విని. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు. నందమూరి ఫ్యామిలీ పేదలకు సహాయం చేయడంలో ముందుంటారని నిరూపించారు తేజస్విని. తన తండ్రి బాలకృష్ణ రావడానికి వీలు కాకపోవడంతో కూతురుతో చెక్ పంపించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version