సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

-

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో మర్యాద పూర్వకంగా ఆయన భేటీ అయ్యారు. దాదాపు గంటపాటుగా సాగిన ఈ ఇరువురి సమావేశంలో వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాలు, ఎన్నికల ఫలితాల గురించి బాలయ్య బాబును రేవంత్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా తెలంగాణ రాజకీయాలపైనా ఇద్దరు చర్చించినట్లు సమాచారం.

మరోవైపు సినిమా సంగతులు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. సినిమా రంగం అభివృద్ధి గురించి బాలయ్య బాబు రేవంత్తో చర్చించారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమాల గురించి రేవంత్ ముచ్చటించారు. ఆయన సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news