బీఆర్ఎస్పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు

-

బీజేపీ నేత రఘునందన్‌ రావు బీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈవో) కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్లు కొనుగోలు చేస్తుందని ఫిర్యాదులో రఘునందన్ రావు ఆరోపించారు. రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు సిద్ధమైందని పేర్కొన్నారు. ఈ లేఖతో బ్యాంక్ ఖాతా వివరాలు కూడా రఘునందన్ రావు జత చేయడం గమనార్హం.

ఈ ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని ఈసీని రఘునందన్ రావు కోరారు. ఖాతా ఫ్రీజ్‌ చేయకపోతే ఓట్ల కొనుగోలుకు వాడుతారని అన్నారు. అలా జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరగవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఈసీకి రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news