బాల్క సుమన్ ఫ్యాన్ అత్యుత్సాహం.. బుల్లెట్లతో..!

-

కొన్నిసార్లు అభిమానులు తమ ప్రియతమ నాయకుల కోసం చేసే పనులు చివరకు వారి మెడకే చుట్టుకుంటాయి. వారికే తంటాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి అనుభవమే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అభిమానికి ఎదురైంది. తన ప్రియతమ నాయకుడి మెప్పు పొందడానికి ఆ అభిమాని చేసిన ఆయనకే తంటా తెచ్చింది.

అసలేం జరిగిందంటే.. ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కొప్పుల రవి అనే సింగరేణి కార్మికుడు శ్రీరాంపూర్​లోని ఎస్ఆర్పీ ఒకటో గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. రవి తన వాట్సాప్ స్టేటస్​లో జై బాల్క సుమన్ అని బుల్లెట్లతో అమర్చిన పేర్లను స్టేటస్​గా పెట్టుకున్నాడు.

అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది. అసలు అతనికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీశారు. చివరికి ఛత్తీస్​గఢ్​లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తోన్న తన స్నేహితుని వాట్సాప్ స్టేటస్ నుంచి కొప్పుల రవి స్టేటస్​గా పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version