పదేళ్లు అధికారంలో ఉన్న మీరు కరీంనగర్ రైతులకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోయారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడులు దూకాయని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండా చేశారని, కరీంనగర్ జిల్లా రైతులు కాంగ్రెస్ పార్టీ వల్ల అన్యాయం అవుతున్నారని, రైతుల కోసం కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తామని గంగుల కమలాకర్ అన్నారు.
ఆయన మాటలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందిస్తూ.. కరీంనగర్ రైతుల కాంగ్రెస్ పార్టీ వల్ల అన్యాయం అవుతున్నారని మాట్లాడుతున్నారని, మేం అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అవుతుందని, మీరు 10 సంవత్సరాలు అధికారంలోనే ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇష్టానుసారం తీసుకున్న అవగాహన లేని నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతుందని తెలిపారు. ఇప్పటికైనా అవగాహన రాజకీయ విమర్శలు చేయడం ఆపేసి, పదేళ్లు మంత్రిగా ఉన్న మీరు జిల్లా రైతుల సమస్యలపై శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోయారో కరీంనగర్ జిల్లా రైతులకు సమాధానం చెప్పాలని బల్మూరి వెంకట్ అన్నారు.