తెలంగాణలో ఎప్పుడూ ఏ పరిస్థితి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ఎన్నికల సమయం ఒక మాట.. ఎన్నికల తరువాత ఒకమాట మాట్లాడుతుంటారు రాజకీయనాయకులు. అది పార్టీ ఏదైనా.. అదే తీరు కొనసాగుతుంది. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా రైతులకు కష్టాలను తీసుకొస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ ధరకు వడ్లను కొని రైతులకు నష్టం జరిగితే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసలు వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మొత్తానికి పేదలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా తెలంగాణలోని జనగాం మార్కెట్ లో వడ్లు కొనాలంటూ పోలీసుల కాళ్ళు మొక్కింది ఓ మహిళా రైతు. రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టాయి పలు సంఘాలు. గత నాలుగు రోజులుగా బంద్ చేసిన జనగామ వ్యవసాయ మార్కెట్ ను తెరువాలని మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. మార్కెట్ ప్రధాన గేట్లకు తాళం వేసి మూసివేయడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఎదుట ధర్నా నిర్వహించారు.