మావోయిస్టులతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు – బండి సంజయ్

-

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్‌ అని ఫైర్ అయ్యారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని పేర్కొన్నారు. మావోయిస్టులతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.

bandi sanjay comments on mavoists

కుల గణనపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్, ‘‘కేంద్రం నిర్ణయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటు’’ అన్నారు. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ దేశవ్యాప్తంగా కుల గణన జరగనివ్వని కాంగ్రెస్ పార్టీకి దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2010లో అనేక పార్టీల డిమాండ్‌కు స్పందిస్తూ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు కేవలం ఓ సర్వేనే చేపట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news