ఏ క్షణమైనా BRS నిట్టనిలువునా చీలే ప్రమాదం ఉంది – బండి సంజయ్‌

-

 

బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందని చెప్పారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూాడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందన్నారు.

ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ అభివ్రుద్ది కోసం రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినందుకు ధన్యవాదాలు. దీంతోపాటు 9 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తూ అనేక అభివ్రుద్ది, సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నారు.యావత్ ప్రపంచం మోదీపట్ల సానుకూలతతో ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు తలెత్తుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో మోదీకి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news