తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల వేళ జన్నారం సింహగర్జన సభలో భాగంగా మాట్లాడుతూ అధికార పార్టీపై జూలు విదిల్చాడు. బండి సంజయ్ మాట్లాడుతూ, డిసెంబర్ 3వ తేదీకి కేసీఆర్ ఇంటికీ పరిమితం అవుతాడని, కచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయి మాజీ సీఎం అవుతారని కామెంట్ చేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో BRS గెలిస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలు వద్దనుకుంటే బీజేపీని మాత్రమే గెలిపించాలి అంటూ లాజికల్ గా బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిచినా BRS లోకి వెళ్లడం పక్కా అంటూ బండి సంజయ్ తేల్చి చెప్పేశాడు. కాంగ్రెస్ మరియు BRS లు రెండూ ఒక్కటే అంటూ కామెంట్ చేశారు బండి. ఈ రెండు పార్టీలలో ఎవరికీ మీరు ఓటు వేసి గెలిపించిన మీ పరిస్థితులు బాగుపడవు.
అందుకే బీజేపీకి ఓటు వేసి గెలిపించండి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసి చుపిస్తాము అంటూ ఒక్క అవకాశం ఇవ్వండి అని బండి సంజయ్ ప్రజలకు అర్థమయ్యేలా తెలియచేసే ప్రయత్నం చేశాడు.