తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పై కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశించింది. గత జనవరి నెలలో తనను కరీంనగర్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని… ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులు బదిలీ నేపథ్యంలో గత జనవరిలో బండి సంజయ్ తన కార్యాయలంలో జాగరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్ లో తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్ ని పోలీసులు తలుపుతు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతరువాత కరీంనగర్ కోర్ట్ సంజయ్ కి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే హైకోర్ట్ పోలీసుల చర్యలను తప్పుబడుతూ… బండి సంజయ్ ని విడుదల చేయాలని ఆదేశించింది.
కాగా.. ఈ ఘటనపై ఫిబ్రవరి 3న తెలంగాణ సీఎస్, డీజీపీ, హెం కార్యదర్శి, కరీంనరగ్ సీపీతో పాటు ఘటనకు కారణమైన వారిని తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. తాజాగా మరోసారి ఈనెల 26న కరీంనగర్ సీపీ సత్యనారాయణను తమ మందు హాజరు కావాలంటూ ఆదేశించింది.