సీఎం కేసీఆర్​కు బండి సంజయ్ బహిరంగ లేఖ

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్​కు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో వడ్ల కుప్పలపై రైతు చనిపోమే దుస్థితికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చి.. మిగతా పథకాలన్నీ ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. లాకప్ డెత్‌లు చేయడం, ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపడమేనా అని సూటిగా ప్రశ్నించారు.

పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మీ 9 ఏళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంత మంది ఉపాధి కోల్పోయారు? ఎన్ని పరిశ్రమలొచ్చాయి? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని కేసీఆర్​కు బండి సవాల్ విసిరారు. “సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప మీరు సాధించిన ప్రగతి ఏముంది? మిషన్ కాకతీయ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చి దండుకోవడం నిజం కాదా?” అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version