రవీందర్‌ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలి: బండి సంజయ్‌

-

ఆత్మహత్య చేసుకున్న హోం గార్డు రవీందర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవీందర్ మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ అన్నారు. రవీందర్ చావుకు కారణం ముమ్మాటికీ కేసీఆర్ సర్కారేనని ఆరోపించారు.

సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రవీందర్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యలను బయటపెట్టాలన్నారు. రవీందర్​ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారిని అన్ని విధాలా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version