తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి నడకమార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టిటిడి పాలక మండలి ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా వుండడంతో ఇనుప కంచే ఏర్పాటు పై సాధ్యాసాధ్యాలను పరిశిలిస్తూన్న టిటిడి… ఇప్పటికే ఇనుప కంచె ఏర్పాటుకు కేంద్ర అనుమతులు కోరింది. త్వరలోనే ఎక్స్ ఫర్ట్స్ కమిటి నడకమార్గంలో పర్యటించి నివేదికన అందజేసే అవకాశం ఉందని సమాచారం.
నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న టిటిడి… ఇప్పటికే ఐదు చిరుతలను భందించింది. మరో మూడు చిరుతల సంచారాన్ని ట్రాప్ కెమరాల ద్వారా గుర్తించిన టిటిడి..వాటిని పట్టుకునేందుకు యత్నస్తోంది. స్పేషల్ టైప్ క్వార్టర్స్,శ్రీవారి మెట్టు నడకదారి,నరశింహస్వామి ఆలయ సమిపంలో సంచరిస్తూన్నాయి చిరుతలు. ఈ తరుణంలోనే.. తిరుమల శ్రీవారి నడకమార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టిటిడి పాలక మండలి ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.