కెసిఆర్ చెల్లని రూపాయి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం : బండి సంజయ్

-

కెసిఆర్ చెల్లని రూపాయి..రేపు ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ దే అధికారమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. 5 రాష్ట్రాల ఫలితాలపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఇక ఖతం… అన్నవారికి… ఈ ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు అన్నారు. అవినీతి రహిత పాలన జరిగింది కాబట్టే… గూండా రాజ్యాలను కూకటివేళ్ళతో పెకిలించాడు కాబట్టే… యూపీ లో ప్రజలు పట్టం కట్టారని స్పష్టం చేశారు.

సిగ్గుతో తలదించుకోవాల్సిన ప్రభుత్వం…. ఇవాళ కేంద్రం పై ఆరోపణలు చేస్తోంది.. యూపీలో ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టే… డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చారని పేర్కొన్నారు. ఇక్కడ కూడా… తెలంగాణ ప్రజలు అభివృద్ధి ని కోరుకుంటున్నారన్నారు.

ghmc ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే కాదు… ఓటింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పారు బండి సంజయ్. ఇంజన్ లేని బండి నడవదు.. తెలంగాణ లో ఇంజన్ దరూసలేం లో ఉందని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్ల పై కోర్టులకు వెళ్ళము… ఎవ్వరు వెళ్లినా కఠినంగా వ్యవహరించండి… అసెంబ్లీ లో కేటీఆర్ చేసిన కామెంట్స్ పట్టించుకోమన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసి… ఉద్యోగ నియామక పత్రాలు అందుకునేవరకు ఎన్నికలకు వెళ్ళను అని కేసీఆర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version