సిట్​కు TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. కేసును నీరుగార్చేందుకే అప్పగించారన్న బండి సంజయ్

-

TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారం దర్యాప్తును సిట్​కు అప్పజెప్పడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసును నీరుగార్చేందుకే సిట్​కు అప్పజెప్పారని మండిపడ్డారు. ఇప్పటికే సిట్​కు అప్పగించిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ.. ఇలా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బండి సంజయ్‌ అన్నారు.

మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్​పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు భాజపా కార్యకర్తలకు కొత్త కాదని.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఈ మేరకు ఆయన  ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news