కేసీఆర్ ను అరెస్ట్ చేయించే దమ్ము ఉందా…? అంటూ రేవంత్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే అని… సింగరేణిలో కేంద్రం వాటా 49, తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం అన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని… ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేయడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రధాని క్రుషి వల్లే యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.