మూసీ దగ్గరికి కాంగ్రెస్ నేతలు పోతే..గంప కిందేసి కుమ్ముతారని హెచ్చరించారు బండి సంజయ్. ఇంగ్లాండ్, సియోల్ కు కాదు …రేవంత్ రెడ్డి దమ్ముంటే మీ మంత్రుల బృందాన్ని మూసి పరివాహ ప్రాంతాలకు పంపు… గంప కిందేసి కుమ్ముతారని చురకలు అంటించారు. ఇందిరా పార్క్ లో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది. మూసీ ప్రభావిత ప్రజలతో కలిసి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది.
ఇందిరా పార్క్ లో మూసీ ప్రభావిత ప్రజలతో కలిసి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. మూసి ప్రక్షాళన అంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలి అల్లుని కోసమే ఈ డ్రామ అని ఆరోపణలు చేశారు. లక్ష 50 వేలు కాక పోతే ఎంత అవుతుండో చెప్పు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు లేరు అందరూ ముఖ్యమంత్రులేనని…. మూసి ఇలా తయారు కావడానికి కారణం కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు.