బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. చంపినోళ్లే సంతాప సభలు పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ తీరు యునాని ఆగ్రహించారు బండి సంజయ్. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్.. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అంబేద్కర్ ను ఓడించిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్… అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకూడదని కోరుకుందని ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ సందర్బంగా ప్రధాని మోడీ ఫొటో పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేయగా.. కేంద్రం దొడ్డు బియ్యం ఇస్తోందని, సన్న బియ్యం ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని బండి సంజయ్ వెల్లడించారు.
–