సన్నబియ్యం లబ్దిదారులే మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యంతో ఊరందరికీ సహపంక్తి భోజనాలు పెట్టిన లక్ష్మీఅని తెలిపారు. సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట గ్రామానికి చెందిన లక్ష్మిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. సన్నబియ్యం పథకం పేదల జీవితాల్లో ఎంతటి ఆనందాన్ని నింపిందో లక్ష్మీ చెప్పే ప్రయత్నం చేసిందంటూ ప్రశంసలు తెలిపారు.

ఇక అటు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వం… ఏ గ్రూపుకు 1%, బీ గ్రూపుకు 9%, సీ గ్రూపుకు 5 % చొప్పున రిజర్వేషన్లు ఇవ్వనుంది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.