మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ఊహించని షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వ్యతిరేకంగా హైదారాబాద్‌లో బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వివిధ ఆరోపణలతో బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాడని.. అతనికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఇందులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చినా.. గెలిపించకూడదని కోరారు. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.