ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ టీం పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో బీసీ కమిషన్ బహిరంగ విచారణలో 90 అర్జీలు వచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ ఎక్కువ గా వచ్చింది. అయితే వచ్చే నెల 13 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ కొనసాగుతోంది. కులగణన ప్రశ్నావళి సిద్దం అవుతుంది.
ఇక త్వరలో కులగణన ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్యూమరేటర్స్ కు శిక్షణ జరుగుతుంది. 80 నుంచి 90 వేల వరకు ఎన్యూమరెటర్ లు ఉంటారు. ఒక్కరు రోజు కు ఒక్కరు పది కుటుంబాల సర్వే చేస్తారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 15 రోజుల పాటు సర్వే జరుగుతుంది. ఆ తర్వాత మరో 15 రోజుల పాటు డేటా ఎంట్రీ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ ను దాన్ని బట్టి రిజర్వేషన్ ల కేటాయింపు అనేది జరుగుతుంది అని చైర్మన్ నిరంజన్ తెలిపారు.