కులగణన సర్వే పై కొందరూ అపోహలు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్దత లేదని.. ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్వేలో బీసీలు 51 శాతం, ఓసీలు 21 శాతం గా చూపించాయి. మేము బీసీలు 56 శాతం, ఓసీలు 13 శాతం అని చెప్పాం. కానీ మేము బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభా పెంచామని అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
బ్రిటీష్ హయాంలో 1931లో కులగణన జరిగింది. తప్ప స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదని.. ప్రతీ పదేళ్లకు జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల లెక్కలను మాత్రమే తీసుకుంటున్నారని.. బీసీల సమాచారం ఉండటం లేదన్నారు. బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం ఇవ్వడానికే రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టామని తెలిపారు. కులగణన సమగ్ర సర్వేలో పాల్గొనని వారికి ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా..? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత సమావేశాలకు రాడు.. సర్వేలో పాల్గొనడు వారికి ఎలా అవకాశం ఇచ్చారు అని ప్రశ్నించారు.