బీసీ రిజర్వేషన్ల పై చట్టం తేవాలి : కేటీఆర్

-

బీసీల రిజర్వేషన్ల పై ప్రభుత్వం చట్టం తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 2014లో బీసీల సంఖ్య 61 శాతంగా ఉంది. 1.68 కోట్ల కుటుంబాలు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నాయి. ఒక్క రోజులోనే ఈ సర్వే పూర్తి చేశాం. అప్పుడు కుటుంబ సర్వే, ఇప్పుడు కులగణన సర్వే చేసింది అధికారులే. అప్పుడు చేసిన అధికారులే ఇప్పుడు చేశారని తెలిపారు. మీరు చేసిన సర్వేతో రాష్ట్రంలో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారు అని ఆయన అసెంబ్లీలో ప్రశ్నించారు.

మరోవైపు మేము సమగ్ర కుటుంబ సర్వే చేస్తే.. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. ఒక్క రోజులో ఏం సర్వే చేస్తారని విమర్శించారు. ప్రస్తుతం మేము సర్వేలో పాల్గొనలేదు.. మీరు వ్యతిరేకిస్తే.. తప్పు కాదు.. మేము వ్యతిరేకిస్తే తప్పా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈ సర్వేను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మీడియాతో చెప్పిన సర్వేనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో కొత్త ఏముంది అని ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news