కేసీఆర్‌ను కలిసిన తరువాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా: బేతి సుభాష్‌రెడ్డి

-

బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రౌడీలు, గుండాలకు టికెట్లు ఇచ్చారని.. తనకు టికెట్‌ ఎందుకు నిరాకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నిర్ణయం కోసం మరో 10 రోజులు వేచి చూస్తానని తెలిపారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. 23 ఏళ్లుగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) జెండా మోశానన్నారు. ఉప ఎన్నికల్లో ఎక్కడ బాధ్యత ఇచ్చినా కష్టపడి పని చేశానని.. రోజూ ప్రజల్లో ఉంటూ.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని పేర్కొన్నారు.

“అధిష్ఠానం టికెట్ ఇచ్చిన వ్యక్తి ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? బండారు లక్ష్మారెడ్డికి ఎందుకిచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అవినీతి, అక్రమాలు చేసిన వాళ్లకు టికెట్ ఇచ్చారు. అధిష్ఠానం పిలిచి మాట్లాడుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదు. బొంతు రామ్మోహన్, నేను అసంతృప్తితో ఉన్నది వాస్తవం. పార్టీ నిర్ణయం కోసం మరో 10 రోజులు వేచి చూస్తాను. కేసీఆర్‌ను కలిసిన తరువాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాను. కాంగ్రెస్‌లోకి రమ్మని ఎవరూ సంప్రదించలేదు.” అని బేతి సుభాష్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version