నేడు భద్రాచలం బంద్ కు కాంగ్రెస్ మరియు వామపక్షాలు పిలుపునిచ్చాయి. భద్రాచలాన్ని 3 పంచాయతీలుగా విభజించడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. పాత గ్రామపంచాయతీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, నేడు భద్రాచలం బంద్ కు కాంగ్రెస్ మరియు వామపక్షాలు పిలుపునిచ్చాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భద్రాచలం మూడు ముక్కలైంది. ఈ క్రమంలోనే భద్రాచలం రాష్ట్రంలో అతిపెద్ద గ్రామపంచాయతీగా అవతరించింది. తెలంగాణ సర్కారు శుక్రవారం జారీ చేసిన కొత్త జీవో ప్రకారం భద్రాచలం మూడు గ్రామ పంచాయతీలుగా విడిపోయింది. భద్రాచలం సీతారామ నగర్, శాంతినగర్ పంచాయతీలుగా విభజించారు. దీంతో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
జీవో ప్రకారం 1 నుంచి 132 వరకు ఉన్న సర్వే నంబర్లను ఒక పంచాయతీగా, 52 నుంచి 90 వరకు ఉన్న సర్వే నంబర్లను రెండో పంచాయతీగా, 91 నుంచి 27 వరకు ఉన్న సర్వే నంబర్లను మూడో పంచాయతీగా మారుస్తారు. అదేవిధంగా సారపాక ప్రధాన పంచాయతీ కూడా రెండు పంచాయతీలుగా విభజించబడింది. సారపాక పంచాయతీలో 1 నుంచి 262 సర్వే నంబర్లు, ఐటిసి పంచాయతీలో 6, 14, 35 నుంచి 262 సర్వే నంబర్లు ఉన్నాయి. పరిపాలనా సులభతరం చేయడానికి పంచాయతీలను విభజించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంద్ కు పిలుపు ఇచ్చారు.