హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తాం: భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

-

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. తాము హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. అడ్డంకులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ‘365 రోజులు జరిగిన కాలుష్యాన్ని పట్టించుకోకుండా హిందూ పండుగలనే దోషిగా చేయడం కరెక్ట్ కాదు’ అని తెలిపింది.

Bhagyanagar Ganesh Utsav Samithi On HC Orders
Bhagyanagar Ganesh Utsav Samithi On HC Orders

కాగా, హుస్సేన్‌ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని తెలంగాణ హైకోర్టు మరోసారి గట్టిగా చెప్పింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించింది. జలాశయాల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయనీయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news