షర్మిల తిరిగి సొంత ఇంటికి వస్తూన్నారు – భట్టి విక్రమార్క

-

షర్మిల తిరిగి సొంత ఇంటికి వస్తూన్నారని కాంగ్రెస్‌ కీలక, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న కాంగ్రెస్‌ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క…కాసేపటి క్రితమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తనతో పాటు పాదయాత్రలో నడిచిన నేతలతో కలసి తిరుపతికి బస్సులో చేరుకున్న భట్టి..శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. రాహూల్, సోనియా గాంధీలను షర్మిల కలవడం మంచిదని భావిస్తున్నానని చెప్పారు.. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ కు విడతీయారాని బంధం ఉందని వెల్లడించారు. షర్మిల తిరిగి సోంత ఇంటికి వస్తూన్నారంటూ కూడా ప్రకటన చేశారు భట్టి విక్రమార్క. రాబోవు ఎన్నికలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట లక్ష్యాన్ని బిఆర్ఎస్ నిర్విర్యం చేసింది….బిజేపికి బీ టీంగా బిఆర్ఎస్ పార్టిని స్థాపించారని మండిపడ్డారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version