ఆరో తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆరు గ్యారంటీ పథకాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని చెప్పారు. మా విజయం ప్రజలకే అంకితం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించారు ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉచిత బస్సు అమలు చేశామని వెల్లడించారు ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రూ. 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పెంచామని వివరించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఇళ్లు లేనివాళ్లకు, పెన్షన్‌లేని వాళ్లకు, గృహజ్యోతి కింద రావాల్సిన విద్యుత్ అన్ని అమలులోకి వస్తాయని చెప్పారు. ఇది ప్రజల ప్రభుత్వం.. మాలాగే ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని బీఆర్ఎస్ చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.