ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం మధిర క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ…కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి అంటున్న కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకుంటున్న బీఆర్ఎస్ కే ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు.
బడ్జెట్లో దళిత బంధు కింద 17 వేల 700 వందల కోట్ల నిధులు కేటాయించి సంవత్సరం అవుతున్నా ఎందుకు ఖర్చు పెట్టలేదని ఆగ్రహించారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గృహలక్ష్మి ,బీసీలకు బీసీ బంద్ అంటూ కాగితాలు పంచుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు ప్రజలు అప్రమత్తంగా ఉండండని కోరారు.
రానున్న ఎన్నికలలో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. వామపక్షాలతో చర్చలు జరిగాయి సీట్ల కేటాయింపు జరగలేదు… షర్మిల సోనియాగాంధీతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా అధిష్టానమే ప్రకటిస్తుంది సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మకండని కోరారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క.