రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉంది : భట్టి విక్రమార్క

-

రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్‌, బడ్జెటేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు గతంలో రుణాలు కుదించారని తెలిపారు. 2023-24లోనూ రూ.70 వేల కోట్ల తేడాతో బడ్జెట్‌ పెట్టారన్న భట్టి.. అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు, అవసరాల మేరకు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. బడ్జెట్‌ మేరకు డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టకుండా పథకాలు ఎత్తేస్తారని వెల్లడించారు.

“రాజస్థాన్‌లో 116.4 శాతం అధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో బడ్జెట్‌ కంటే అధికంగా ఖర్చు పెట్టారు. రాజస్థాన్‌లో రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్‌ పెడితే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్‌ పెడితే ప్రమాదం ఉంది. వాస్తవాలకు దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం ఏర్పడుతుంది. గతంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికే చేసిన అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తాం.”అని భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news