తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. జనవరి 1 నుంచి అందుబాటులోకి భూ భారతి పోర్టల్ రానుందట. డిసెంబర్ 31 తో టెర్రాసిస్ గడువు ముగియనుంది…జనవరి1 నుంచి NIC భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో నిర్వహణ ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIC) కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ కానుంది.
ఈ తరునంలోనే రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే స్పష్టం చేశారట ప్రభుత్వ పెద్దలు. అర్థరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు..ఏ సర్వర్ నుండి ఏ ఐపి అడ్రస్ అయ్యారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు అనే అంశాలపై ఫోకస్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో… ధరణి లావా దేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు సమాచారం అందుతోంది.