‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే.. అదే నా చివరిరోజన్న అభిమాని?

-

మెగాపవర్ స్టార్ రామ్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వచ్చేనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. కానీ, ట్రైలర్ ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ నేపథ్ంలోనే రాంచరణ్ అభిమాని ఒకరు రాసిన ‘రిప్ లెటర్’ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.త్వరగా ట్రైలర్ విడుదల చేయకపోతే కొత్త ఏడాది ప్రారంభంలో ఆత్మహత్య చేసుకుంటానని ఆ నోట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.

‘గౌరవనీయులైన గేమ్‌ఛేంజర్ గారికి నేను అనగా.. ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్.. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవట్లేదు.ఈ నెలాఖరు కల్లా మీరు ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్’ అంటూ రాసుకొచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news