తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి గంగుల కమలాకర్‌కు తాజాగా పెను ప్రమాదo తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్.
అయితే, ఇదే సమయంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. నాటు పడవ కావటంతో అదుపు తప్పి నీళ్లలో పడ్డారు గంగుల కమలాకర్. దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది…. గంగుల కమలాకర్ ను సేవ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.