తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ నగరంలోని ఎల్లా హోటల్ వేదికగా… ఇవాళ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయ్యే ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, ఇతర ఎఐసిసి కార్యదర్శులు సమావేశంలో పాల్గొంటారు. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇప్పటికే హైదరాబాదులోని ఎల్లా హోటల్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం సిఎల్పీ సమావేశం జరుగును ఉండగా… రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది. అంతేకాకుండా రేపే మంత్రి వర్గం కూడా ఏర్పాటు కానుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బిజెపికి ఎనిమిది, ముస్లిం పార్టీ అయిన ఎంఐఎం కు ఏడు సీట్లు వచ్చాయి.