MLC తీన్మార్ మల్లన్న చుక్కదురు. MLC తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోండి..అంటూ DGP కి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెల ఒక పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇక రేవంత్ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన కమిషన్ తెలంగాణ రాష్ట్ర DGP కి ఈ సంఘటనకు కారకులైన మహిళ ఎమ్మెల్సీపై అనాలోచితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన MLC తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకొని నాలుగు వారాల్లో నివేదికను సమర్పించాలని డీజీపీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్.